కోట్లు సంపాదించాలని బాలీవుడ్‌కి వెళ్లలేదు - రామ్‌చరణ్ | went to bollywood, but not for money sake, says ramcharan | Sakshi
Sakshi News home page

కోట్లు సంపాదించాలని బాలీవుడ్‌కి వెళ్లలేదు - రామ్‌చరణ్

Aug 28 2013 12:15 AM | Updated on Apr 3 2019 6:23 PM

కోట్లు సంపాదించాలని బాలీవుడ్‌కి వెళ్లలేదు - రామ్‌చరణ్ - Sakshi

కోట్లు సంపాదించాలని బాలీవుడ్‌కి వెళ్లలేదు - రామ్‌చరణ్

‘‘కష్టపడే తత్వం చరణ్‌ది. తను ఎన్నుకునే కథలు కూడా బావుంటాయి. ఇక్కడ విజయాలు సాధించినట్లే, బాలీవుడ్‌లో కూడా చరణ్ సక్సెస్ అవాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి.

‘‘కష్టపడే తత్వం చరణ్‌ది. తను ఎన్నుకునే కథలు కూడా బావుంటాయి. ఇక్కడ విజయాలు సాధించినట్లే, బాలీవుడ్‌లో కూడా చరణ్ సక్సెస్ అవాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నేను పెద్దగా మాట్లాడలేకపోయినా... మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా’’ అని వెంకటేష్ అన్నారు. రామ్‌చరణ్ కథానాయకునిగా బాలీవుడ్‌లో రూపొందిన ‘జంజీర్’ చిత్రం తెలుగులో ‘తుఫాన్’గా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయిక. 
 
 అపూర్వలఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.  వెంకటేష్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని అల్లు అరవింద్‌కి అందించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ -‘‘బాలీవుడ్‌కి వెళ్లాల్సిన అవసరం చరణ్‌కి ఎందుకొచ్చింది. ఇక్కడ బాగానే ఉందిగా... చాలామందిని వెంటాడుతున్న ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఒక్కటే.  తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పెంచాలనే బాలీవుడ్‌కి వెళ్లాను. అంతేతప్ప బాలీవుడ్‌లో పెద్ద స్టార్ అయిపోవాలని, కోట్లు సంపాదించేయాలని కాదు. అపూర్వ లఖియా నాకు రోజూ ఫోన్ చేసేవారు. ఓ దశలో ఆయన ఫోన్‌ని లిఫ్ట్ చేయడం మానేశాను. 
 
 ఇలా 8 నెలలు గడిచాక కథ విన్నాను. బౌల్డ్ అయిపోయాను. అంత నచ్చింది. నాన్నకు ఈ విషయం చెబితే, ‘కథను నమ్ముకొని చేయ్. బాగుంటే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. శ్రీహరి ఇందులో షేర్‌ఖాన్‌గా నటించడం సినిమాకు పెద్ద ఎస్సెట్’’ అని చెప్పారు. అపూర్వలఖియా, శ్రీహరి, వీవీ వినాయక్, వంశీపైడిపల్లి, దిల్‌రాజు, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, బండ్ల గణేష్, దానయ్య, మహీగిల్, తనికెళ్ల భరణి, చంద్రబోస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement