మళ్లీ బాలీవుడ్‌కి రామ్‌చరణ్? | Salman Khan Launching Ram Charan Again in Bollywood | Sakshi
Sakshi News home page

మళ్లీ బాలీవుడ్‌కి రామ్‌చరణ్?

Apr 25 2016 1:55 AM | Updated on Apr 3 2019 6:34 PM

మళ్లీ బాలీవుడ్‌కి రామ్‌చరణ్? - Sakshi

మళ్లీ బాలీవుడ్‌కి రామ్‌చరణ్?

‘జంజీర్’ రీమేక్ ద్వారా బాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన రామ్‌చరణ్ మళ్లీ హిందీలో ఓ సినిమా చేయనున్నారా?

‘జంజీర్’ రీమేక్ ద్వారా బాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన రామ్‌చరణ్ మళ్లీ హిందీలో ఓ సినిమా చేయనున్నారా? అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నిర్మిస్తారట. చిరంజీవి కుటుంబంతో సల్మాన్‌కి మంచి అనుబంధం ఉంది. ఆయన హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తే చిరు ఇంటి నుంచి రుచికరమైన వంటలతో సల్మాన్‌కి క్యారేజీ వెళుతుంది. అలాగే, చరణ్ ముంబయ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు సల్మాన్ కూడా స్వయంగా క్యారేజీలు పంపిస్తుంటారు. సో.. చరణ్‌తో సినిమా నిర్మించే ప్రతిపాదనను ఎవరైనా చేస్తే ఆయన కాదనకపోవచ్చు. అసలు విషయం ఏంటో తెలియాలంటే ఓపిక పట్టాలి మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement