విక్రమ్కు జోడిగా త్రిష | Vikram, Trisha teams up with director Hari for 'Saamy 2' | Sakshi
Sakshi News home page

విక్రమ్కు జోడిగా త్రిష

Feb 22 2017 4:58 PM | Updated on Sep 5 2017 4:21 AM

విక్రమ్కు జోడిగా త్రిష

విక్రమ్కు జోడిగా త్రిష

కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ వస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, త్వరలో ఓ మాస్ మసాలా

కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ వస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, త్వరలో ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో విక్రమ్ హీరోగా సామి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల సూర్య హీరోగా సింగం సీరీస్ లో మూడో భాగాన్ని రిలీజ్ చేసిన హరి, విక్రమ్ హీరోగా కూడా సీక్వల్నే రూపొందించనున్నాడు.

విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఇరుముగన్ సినిమా ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న డైరెక్టర్ హరి, త్వరలోనే విక్రమ్తో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు. అన్న మాట ప్రకారం సింగం 3 సినిమా తరువాత సామి ను పట్టాలెక్కిస్తున్నాడు. ఈసినిమా కూడా సింగం తరహాలోనే పక్కా సీక్వల్ లా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే తొలి భాగంలో హీరోయిన్గా నటించిన త్రిషనే మరోసారి హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాలో తనకు చాన్స్ ఇవ్వటంపై హీరోయిన్ త్రిష ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement