దగ్గుబాటి మామ.. అక్కినేని అల్లుడు వచ్చేస్తున్నారు | Venky Mama Making Video On Bobby Birthday occasion | Sakshi
Sakshi News home page

దర్శకుడు బాబీ పుట్టినరోజు సందర్భంగా మేకింగ్‌ వీడియో

Aug 1 2019 8:48 PM | Updated on Aug 1 2019 8:53 PM

Venky Mama Making Video On Bobby Birthday occasion - Sakshi

ఎఫ్‌2 చిత్రంతో మంచి హిట్‌ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్‌.. మజిలీ చిత్రంలో దూకుడుమీదున్న నాగచైతన్య కలిసి వెంకీమామ చిత్రంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్లనే రీల్‌ లైఫ్‌లోనూ అవే పాత్రలనూ పోషించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఫస్ట్‌ లుక్‌తోనే మంచి హైప్‌ క్రియేట్‌ చేసిన చిత్రబృందం.. తాజాగా మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. దర్శకుడు కేఎస్‌ రవీంద్ర(బాబీ) పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను విడుదల చేయగా.. రానా తన ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్‌ చేశాడు. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను ఆగస్టులో రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement