గతజన్మ స్మృతులతో..! | valii first look | Sakshi
Sakshi News home page

గతజన్మ స్మృతులతో..!

Dec 18 2015 11:51 PM | Updated on Sep 3 2017 2:12 PM

గతజన్మ స్మృతులతో..!

గతజన్మ స్మృతులతో..!

‘బాహుబలి’, ‘బజ్‌రంగీ భాయ్‌జాన్’ చిత్రాలతో ఈ ఒక్క ఏడాదే వెయ్యి కోట్ల రచయిత అనిపించుకున్నారు విజయేంద్ర ప్రసాద్.

‘బాహుబలి’, ‘బజ్‌రంగీ భాయ్‌జాన్’ చిత్రాలతో ఈ ఒక్క ఏడాదే వెయ్యి కోట్ల రచయిత అనిపించుకున్నారు విజయేంద్ర ప్రసాద్. కొంత విరామం తర్వాత ఆయన ‘వల్లీ’ పేరుతో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ డైరెక్ట్ చేస్తున్నారు. నేహా హింగే, రజత్ కృష్ణ, అర్హా ముఖ్యతారలుగా రాజ్‌కుమార్ బృందావన్ నిర్మిస్తున్న  ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ గురువారం జరిగింది. ‘‘మనిషి మనసు చదవగలిగే యంత్రం కనిపెట్టడా నికి జీవితాన్ని ధారపోసే ఓ సైంటిస్ట్ కూతురు వల్లి. ఆమె తన తండ్రి లక్ష్యాన్ని సాధించా లనుకుంటుంది.

ఆ క్రమంలోనే తన గురువు అశోక్ మల్హోత్రా చేసే ప్రయోగాలకు ఆధారమవు తుంది. ఫలితంగా ఆమెకు తన గత జన్మ స్మృతులు గుర్తుకు వస్తాయి. అప్పుడే తను లైలా అని తెలుస్తుంది. ఈ లైలా ప్రేమ కోసం వేయి సంవ త్సరాలుగా ఎదురుచూస్తున్న మజ్ను, ఇంకో పక్క వల్లిని ప్రేమించే యువకుడు, మరో పక్క ఆమెను ఇబ్బందిపెట్టే లెస్బియన్... మధ్య కథ నడుస్తుంది’’ అని   విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. షూటింగ్ పూర్తయిందనీ,  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ నిర్మాత చెప్పారు. వేడుకలో రాజీవ్ కనకాల, రజత్‌కృష్ణ, అర్హాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement