‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల | Tooneega Movie Theatrical Trailer | Sakshi
Sakshi News home page

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

Aug 19 2019 2:34 PM | Updated on Aug 21 2019 3:44 PM

Tooneega Movie Theatrical Trailer - Sakshi

హైదరాబాద్ : వినీత్ చంద్ర, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన తూనీగ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ సామాజిక మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేసింది. ఆద్యంతం ఆధునిక సాంకేతిక హంగుల‌తో నిండిన ఈ ట్రైల‌ర్ సినీ ప్రేమికుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రానికి చెందిన ప్రేమ్ సుప్రీమ్ అనే యువ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల‌ను పల‌క‌రించ‌నుంది. క్రౌండ్ ఫండింగ్ విధానంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ స‌దాశివుని అందించ‌గా, సినిమాటోగ్ర‌ఫీ హ‌రీశ్ ఎదిగ సమ‌కూర్చారు. ఎడిట‌ర్‌గా ఆర్కే కుమార్, పోస్ట‌ర్ డిజైన‌ర్‌గా వ‌ర్థ‌మాన డిజిట‌ల్ ఆర్టిస్ట్ ఎంకేఎస్ మ‌నోజ్ వ్య‌వ‌హ‌రిం చారు.

ప్రేమ్ పెయింటింగ్స్ ప‌తాకంపై తెర‌కెక్కిన ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణాంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అంతా కొత్త‌వారే క‌లిసి రూపొందించిన ఈ చిత్రం ట్రైల‌ర్‌ను మ్యాంగో మ్యూజిక్ సంస్థ ఆన్ లైన్ మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా త‌మ‌కెంతో స‌హకరిస్తున్న అన్ని ప్ర‌సార మాధ్య‌మాల‌కూ, ప్ర‌చుర‌ణ మాధ్య‌మాల‌కూ చిత్ర యూనిట్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ప్ర‌చార సార‌థి ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి నేతృత్వాన ఇప్ప‌టికే విడుద‌లయిన డిజిట‌ల్ డైలాగ్, డిజిట‌ల్ పోస్ట‌ర్ వీక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయ‌ని డైరెక్ట‌ర్ ఆనందం వ్య‌క్తం చేశారు. చిత్ర బృందానికి శ్రీ‌కాకుళం ఫిల్మ్ క్ల‌బ్ త‌ర‌ఫున ర‌మేశ్ నారాయ‌ణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement