సంగీత దర్శకుడు చక్రి మృతితో టాలీవుడ్ చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చక్రి ఇక లేడన్న చేదు నిజాన్ని ...
హైదరాబాద్ : సంగీత దర్శకుడు చక్రి మృతితో టాలీవుడ్ చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చక్రి ఇక లేడన్న చేదు నిజాన్ని ఆయన సన్నిహితులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముుఖులు సంతాపం తెలిపారు. చక్రి మృతి పట్ల 'మా' అసోసియేషన్ సంతాపం ప్రకటించింది. మరోవైపు చక్రి మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ...అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు. పలువురు గాయనీ గాయకులు చక్రి భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు.