ఆ ముగ్గురే నా లక్ష్యం!
బాలీవుడ్‌లో నటించిన తొలి సినిమాకే ‘వంద కోట్ల హీరోయిన్’ అనిపించుకున్నారు ఇలియానా. ‘బర్ఫీ’ పుణ్యమా అని ఈ గోవా భామకు బాలీవుడ్‌లో అవకాశాలు పోటెత్తాయి.
బాలీవుడ్‌లో నటించిన తొలి సినిమాకే ‘వంద కోట్ల హీరోయిన్’ అనిపించుకున్నారు ఇలియానా. ‘బర్ఫీ’ పుణ్యమా అని ఈ గోవా భామకు బాలీవుడ్‌లో అవకాశాలు పోటెత్తాయి. షాహిద్‌కపూర్‌కి జోడీగా ఆమె నటించిన ‘పటా పోస్టర్ నిక్లా హీరో’ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ నెల 20న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిగాక సైఫ్ అలీఖాన్ సరసన ‘హ్యాపీ ఎండింగ్’, వరుణ్‌ధావన్‌కు జోడీగా ‘మెయిన్ తేరా హీరో’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇలియానా.
ఇటీవలే ‘పటా పోస్టర్ నిక్లా హీరో’ చిత్రం ప్రచారంలో భాగంగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలియానా. ఈ చిత్రంతో తప్పకుండా తాను ద్వితీయ విఘ్నాన్ని అధిగమిస్తానని నమ్మకం వ్యక్తం చేశారు ఇలియానా. బాలీవుడ్ కథానాయికగా మీ లక్ష్యం? అని విలేకరులు అడిగితే -‘‘ఖాన్ త్రయంతో జతకట్టడం. అమీర్, షారుక్, సల్మాన్ అంటే చిన్నప్పట్నుంచీ నాకు క్రేజ్. కథానాయిక అయ్యాక... వారితో జతకట్టాలని కలలు కన్నాను. అనుకోకుండా బాలీవుడ్‌లో కూడా సక్సెస్ సాధించాను.
ఇకనైనా ఆ కోరక తీరుతుందని ఆశగా ఉన్నాను’’ అని చెప్పారు ఇలియానా. పనిలో పనిగా హృతిక్‌రోషన్‌తో కూడా నటించాలని ఉందని కొసరు కోరికను కూడా వ్యక్తం చేసేశారు ఇలియానా. అసిన్ తర్వాత సౌత్ నుంచి వచ్చిన ఏ కథానాయికకూ రానంత స్పందన బాలీవుడ్‌లో ఇలియానాకు వస్తోందని, తాను అనతికాలంలోనే అనుకున్న టార్గెట్‌ని రీచ్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.