కాలు జారితే కష్టం అంటున్నారు ఇలియానా. దీనికి చాలామంది రకరకాల అర్థాలు తీసే అవకాశం ఉంది. కానీ, ఇలియానా చెబుతున్నది తడిగా ఉన్న గచ్చు గురించి.
కాలు జారితే కష్టం అంటున్నారు ఇలియానా. దీనికి చాలామంది రకరకాల అర్థాలు తీసే అవకాశం ఉంది. కానీ, ఇలియానా చెబుతున్నది తడిగా ఉన్న గచ్చు గురించి. ఇటీవల ఓ అమ్మాయి ఇలియానా కళ్ల ముందే జర్రున జారిపడింది. దాంతో ఈ గోవా సుందరి కంగారు పడిపోయి, ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి, చెయ్యిపట్టుకుని పైకి లేపారట. ఆ అమ్మాయికి దెబ్బలేవీ తగలకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారామె. ఈ సందర్భంగానే తడి గచ్చు చాలా ప్రమాదం సుమా అన్నారు ఇలియానా. ఇదిలా ఉంటే.. ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌లో వైభవంగా కెరీర్ ప్రారంభించిన ఇలియానాకు మలి చిత్రం ‘ఫటా పోస్టర్ నిఖ్‌లా’ పరాజయం చేదు అనుభవాన్ని మిగిల్చింది. 

