అమ్మ ఇచ్చిన తొలి కానుకకు 30 ఏళ్లు! | The first car that my mom got for me in 1986, says rahman | Sakshi
Sakshi News home page

అమ్మ ఇచ్చిన తొలి కానుకకు 30 ఏళ్లు!

Sep 8 2016 12:24 PM | Updated on Oct 22 2018 6:05 PM

అమ్మ ఇచ్చిన తొలి కానుకకు 30 ఏళ్లు! - Sakshi

అమ్మ ఇచ్చిన తొలి కానుకకు 30 ఏళ్లు!

తన సంగీతంతో భారతదేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించాడు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్.

తన సంగీతంతో భారతదేశానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించాడు మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్. ఎందరో సినీ కళాకారుల జీవితలక్ష్యమైన అస్కార్ అవార్డును సొంతం చేసుకున్నాడు. 'ఢిల్లీకి రాజైనా అమ్మకు మాత్రం కొడుకే' అనే సామెత గుర్తుంది కదండీ.. అదే రీతిలో రహమాన్ కూడా ప్రవర్తించారు. అమ్మ ఎంతో అప్యాయతతో తనకు అందించిన ఓ బహుమతిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. సరిగ్గా ముప్పై ఏళ్ల కిందట(1986లో) రెహమాన్ కు వాళ్ల అమ్మ కొనిచ్చిన తన తొలి కారు ఫొటోను ఫేస్ బుక్, ట్విట్టర్ మాధ్యమాలలో షేర్ చేశాడు. ఆ కానుకతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేసుకోగా, ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

ఫేస్ బుక్ లో మాత్రం వెంటనే ఆయన అభిమానులు స్పందించారు. పోస్ట్ చేసిన ఆ ఫొటోకు లైక్స్ వర్షం కురుస్తోంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే 51 వేలకు పైగా లైక్స్ తో పాటు వందల మంది కామెంట్లు, షేర్ చేయడంతో వైరల్ గా మారింది. కొందరైతే అమ్మ ఇచ్చిన బహుమతిని ఇలాగేనా చూసుకునేది, కారును బాగు చేయించండి సార్ అంటూ కామెంట్ చేశారు. అమ్మ అప్యాయతతో ఏది ఇచ్చినా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా మీపై ఉంది అంటూ రెహమాన్ కు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement