
ఆస్కార్ అవార్డ్ గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన కూతురు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన కుమార్తె పట్టభద్రురాలైందని వెల్లడించారు. స్విట్జర్లాండ్లోని గ్లియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో తన విద్య పూర్తి చేసుకుందని తెలిపారు. హాస్పిటాలిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ కోర్సులో రహీమా మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఏఆర్ రెహమాన్ ఆనందంగా వ్యక్తం చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.
కాగా.. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం నార్త్ అమెరికాలో తన వండర్‌మెంట్ టూర్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు రెహమాన్కు సైరా బానుతో 1995లో వివాహం జరిగింది. ఈ జంటకు రహీమాతో పాటు ఖతీజా, అమీన్ అనే మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఏఆర్ రెహమాన్, తన భార్య సైరా బానుతో విడిపోయారు. గతేడాది నవంబర్లో విడిపోతున్నట్లు ప్రకటించారు.