జాగృతి కోసం... | The Bells Telugu Movie Opening | Sakshi
Sakshi News home page

జాగృతి కోసం...

Sep 28 2014 11:36 PM | Updated on Aug 20 2018 8:20 PM

జాగృతి కోసం... - Sakshi

జాగృతి కోసం...

సమకాలీన సమస్యల ఆధారంగా జగదాంబ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘ది బెల్స్’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ‘జాగృతి కోసం’ అనేది ఉపశీర్షిక. రాహుల్, నేహా దేశ్‌పాండే జంటగా

 సమకాలీన సమస్యల ఆధారంగా జగదాంబ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘ది బెల్స్’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ‘జాగృతి కోసం’ అనేది ఉపశీర్షిక. రాహుల్, నేహా దేశ్‌పాండే జంటగా నెల్లుట్ల ప్రవీణ్ దర్శకత్వంలో ఎర్రోజు వెంకటాచారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పాలెం శ్రీకాంత్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ సలహాదారులు విద్యాసాగర్ రావు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు అల్లాణి శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి, సమాజ శ్రేయస్సు కోసం యువతరం ఏం చేశారన్నదే ఈ చిత్రం కథాంశం’’ అని చెప్పారు. వచ్చే నెల 6న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, ఈ చిత్రంలో మంచి సందేశం ఉందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి రచన-మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: కాసర్ల శ్యామ్, కెమెరా: ఉదయ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement