నీ గ్యాంగ్‌తో రా.. చూస్కుందాం!

Tharun Bhascker Next Ee Nagaraniki Emaindhi Wraps Up - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ ; పెళ్లి చూపులు ఫేమ్‌ తరుణ్‌ భాస్కర్‌ రెండో చిత్రం ఓ కొలిక్కి వచ్చేసింది. సురేశ్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో రూపొందించిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ ఎట్టకేలకు షూటింగ్‌ను పూర్తి చేసేసుకుంది. నీ గ్యాంగ్‌తో రా థియేటర్‌కి .. చూస్కుందాం అన్న ఫన్నీ కాప్షన్‌తో మేకర్లు ఓ పోస్టర్‌ను వదిలారు. 

కెమెరా, క్లాప్‌ తదితర సామాన్లతో నడుస్తూ వెళ్తున్న నలుగురు యువకులతో ఆ పోస్టర్‌ ఉంది. ఆ యువకుల జీవితంలో జరిగే విషయాలు.. లక్ష్యాలు... తదితర నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. దాదాపు కొత్తవారితోనే ఈ చిత్రం రూపొందింది. ఫస్ట్‌ టెస్ట్‌ స్క్రీనింగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందన్న నిర్మాతలు.. త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. మరోవైపు దగ్గుబాటి హీరో రానా కూడా తన ట్వీటర్‌లో ఈ విషయాన్ని తెలియజేశాడు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top