సూపర్‌స్టార్‌కు దీటుగా ఇళయ దళపతి?  | Tamil Hero Vijay To Compete With Rajinikanth | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌కు దీటుగా ఇళయ దళపతి? 

Mar 28 2020 8:05 AM | Updated on Mar 28 2020 8:05 AM

Tamil Hero Vijay To Compete With Rajinikanth - Sakshi

సూపర్‌స్టార్‌కు దీటుగా ఇళయ దళపతి నిలబడనున్నారా? తమిళనాడులో  రజనీకాంత్‌ తర్వాత అంత ఫాలోయింగ్‌ ఉన్న నటుడిగా విజయ్‌ వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్‌ “మాస్టర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి మానగరం, ఖైదీ చిత్రాల ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్‌కి జంటగా నటి మాళవికా మోహన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఏప్రిల్‌ 9వ తారీకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇంతకు ముందే ప్రకటించారు.

అయితే, ఈ చిత్రం విడుదల కరోనా ఎఫెక్ట్‌ కారణంగా జూన్‌కు వాయిదా పడే అవకాశం ఉందని తాజా సమాచారం. కాగా, మరో సారి మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌ నటించనున్నారనే ప్రచారం ఇప్పటికే వైరల్‌ అవుతోంది. ఇది తుపాకీ చిత్రానికి సీక్వెల్‌ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే, ఈ చిత్రానికి విజయ్‌ పారితోషికం ఎంత ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

కారణం ఇంతకు ముందు బిగిల్‌ చిత్రానికి రూ.60 కోట్లు, మాస్టర్‌ చిత్రానికి రూ.80 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఆయనే స్వయంగా ఐటీ అధికారులకు తెలిపారు. దీంతో కొత్త చిత్రానికి విజయ్‌ పారితోషికం రూ.100 కోట్లకు చేరిందని ఓ ప్రముఖ విలేఖరి పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే రజనీకాంత్‌ రూ.107 కోట్లు పారితోషికాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు విజయ్‌ రూ.100 కోట్ల పారితోషికం  నిజమైతే సూపర్‌స్టార్‌ కు దీటుగా నిలిచినట్లవుతుంది. 
    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement