
జయాపజయాలు సహజం
విజయం ఎప్పుడు? ఎలా? లభిస్తుందో ఊహించడం కష్టం. సామర్థ్యం ఉన్నా, శ్రమించినా ఒక్కోసారి ప్రతిఫలం దక్క దు. ప్రస్తుతం నటి తమన్న పరిస్థితి ఇలాగే ఉంది. ఈ బ్యూటీ మంచి నటే.
విజయం ఎప్పుడు? ఎలా? లభిస్తుందో ఊహించడం కష్టం. సామర్థ్యం ఉన్నా, శ్రమించినా ఒక్కోసారి ప్రతిఫలం దక్క దు. ప్రస్తుతం నటి తమన్న పరిస్థితి ఇలాగే ఉంది. ఈ బ్యూటీ మంచి నటే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. లక్కీ గర్ల్ కూడా తమిళం, తెలుగు భాషల్లో పలు విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఈ క్రే జ్ ఆమెకు బాలీవుడ్‌లో పని చెయ్యలేదు. అక్కడ నటించిన తొలి చిత్రం హిమ్మత్‌వాలా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దీంతో తమన్న బాలీవుడ్‌లో విజయం కోసం పోరాడాల్సిన పరిస్థితి. అయితే ఈ గుజరాత్ భామ తన మనో స్థైర్యాన్ని కోల్పోలేదు.
అక్కడ గెలవడానికి మరో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా, తొలి చిత్ర దర్శకుడు సాజిత్‌కాన్ దర్శకత్వంలోనే మళ్లీ నటిస్తున్నారు. దీనిపై తమన్న తెలుపుతూ బాలీవుడ్‌లో తన తొలి చిత్రం అపజయం గురించి చింతించడం లేదన్నారు. అందుకు కారణాలేమిటన్నది కూడా విశ్లేషించడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జయాపజయాలు సహజం. ప్రతి ఒక్కరి జీవితంలోను ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందన్నారు.
వరుస విజయాలు సాధ్యం కాదు, అలాగే వరుస అపజయాలు ఎదురు కావని చెప్పారు. జయాపజయాల సంగమమే సినిమా. తాను ఈ రెండింటినీ చవిచూశానన్నారు.సాజిత్‌ఖాన్ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉంది. ఆయన్ని ప్రేమిస్తున్నాననే ప్రచారం జరుగుతోంది. సాజిత్ తనకు సోదర సమానులు. మా కాంబినేషన్‌లో వస్తున్న మలి చిత్రం హంషకల్స్ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్న త్వరలో తమిళంలో ఆర్యతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు.