ఫుల్‌ జోష్‌లో మిల్కీబ్యూటీ! | tamanna acting many movies in 2018 year | Sakshi
Sakshi News home page

ఫుల్‌ జోష్‌లో మిల్కీబ్యూటీ!

Jan 19 2018 6:32 PM | Updated on Aug 9 2018 7:30 PM

tamanna acting many movies in 2018 year - Sakshi

సాక్షి, సినిమా : నటి తమన్నా ఫుల్‌ జోష్‌లో ఉంది. మిల్కీ బ్యూటీ బాహుబలి చిత్రంలో విప్లవ నారిగా వీరోచిత పోరాటాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు.  అలాంటి పాత్రలు మరిన్ని వస్తాయని ఆమె ఆశించింది. అయితే ఆమె ఊహలు ఫలించలేదు. చాలా చిత్రాల్లో తమన్నాను గ్లామర్‌ డాల్‌గానే వాడుకుంటున్నారు. ఆ మధ్య కత్తిసండై చిత్ర వ్యవహారంలో అందాలారబోతకే హీరోయిన్లు అన్న దర్శకుడి కామెంట్‌కు భగ్గుమన్న తమన్నా ఆ తరువాత కూడా అన్భానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ లాంటి చిత్రాల్లో గ్లామర్‌కే పరిమితమైంది.

అలాంటిది తమన్నా పరిస్థితి ఇప్పుడు కాస్త మెరుగుపడిందని చెప్పకతప్పదు. తాజాగా విక్రమ్‌తో నటించిన స్కెచ్‌ సక్సెస్‌ బాటలో పయనించడంతో ఈ మిల్కీబ్యూటీ ఖుషీ అయిపోతోంది. అంతే కాదు చేతి నిండా చిత్రాలతో యమ బిజీగా ఉంది. ఈ సందర్భంగా తమన్నా ఏమంటుందో చూద్దాం. స్కెచ్‌ చిత్రం విజయం నూతనోత్సాహాన్నిచ్చింది. ప్రస్తుతం శీనురామస్వామి దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాను. తెలుగులో క్వీన్‌ రీమేక్‌తో పాటు మరో రెండు చిత్రాలు చేస్తున్నాను. హిందీలోనూ ఒక చిత్రం ఉంది. 2018లో నేను చేస్తున్న చిత్రాలనింటిలోనూ ప్రాముఖ్యత ఉన్న పాత్రలనే పోషిస్తున్నా. అవన్నీ నటిగా నా స్థాయిని పెంచేవే. ఈ ఏడాది నటిగా నా ప్రతిభ మరింత పెరుగుతుందని తమన్నా చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement