యూత్‌ లీడర్‌!

Suriya Is Nanda Gopala Krishna - Sakshi

అక్కడ ఓ పొలిటికల్‌ మీటింగ్‌ స్టార్ట్‌ అవ్వడానికి సర్వం సిద్ధమైంది. అప్పటికే కూర్చొన్న జనం తమ నాయకుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడికి నంద గోపాలకృష్ణ (ఎన్‌జీకే) ఎంట్రీ ఇచ్చాడు. అంతే.. ‘ఎన్‌జీకే జిందాబాద్‌’ అంటూ ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ఎన్‌జీకే’. ఇందులో సూర్య ఎమ్‌ఎల్‌ఏ పాత్ర పోషిస్తున్నారని కోలీవుడ్‌ సమాచారం. అంతేకాదు సినిమాలో ‘కాక్కుమ్‌ మున్నేట్ర కళగమ్‌’ అనే పొలిటికల్‌ పార్టీ యూత్‌ వింగ్‌ లీడర్‌ కూడా ఎన్‌జీకేనే అట. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top