లండన్‌లో సూర్య చిత్రం

Suriya Movie Starts In London - Sakshi

తమిళసినిమా: నటుడు సూర్య చిత్రానికి లండన్‌లో పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఎన్‌జీకే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. సూర్య తదుపరి చిత్రానికి రెడీ అయిపోయారు. కేవీ.ఆనంద్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఇది ఆయన 37వ చిత్రం. ఇందులో ఆయనకు జంటగా బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్‌ నటించనుంది. ప్రధాన పాత్రల్లో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్, తెలుగు యువ నటుడు అల్లు శిరీష్‌ నటించనున్నారు. ముఖ్య పాత్రల్లో హిందీ నటుడు బొమ్మన్‌ ఇరాని, సముద్రకని నటించనున్నారు.

ఇంతకు ముందు సూర్య, కేవీ.ఆనంద్‌ల కాంబినేషన్‌లో అయన్, మాట్రాన్‌ చిత్రాలు రూపొందాయి. తాజా చిత్రం వీరి కలయికలో తెరకెక్కుతున్న మూడవ చిత్రం అన్నది గమనార్హం. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం చిత్ర యూనిట్‌ లండన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సూర్య, సాయేషాసైగల్‌లతో పాటు చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు. దీనికి హరీశ్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను పలు దేశాలలో చిత్రీకరించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. సోమవారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. అయితే నటుడు సూర్య మాత్రం ఎన్‌జీకే చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని, అంత వరకూ ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top