సన్నీ ఆటో ఎక్కితే రచ్చ రచ్చ! | sunny leone clling for auto | Sakshi
Sakshi News home page

సన్నీ ఆటో ఎక్కితే రచ్చ రచ్చ!

Mar 2 2014 11:27 PM | Updated on Sep 2 2017 4:16 AM

సన్నీ ఆటో ఎక్కితే  రచ్చ రచ్చ!

సన్నీ ఆటో ఎక్కితే రచ్చ రచ్చ!

ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వస్తే.. ప్రమాదాలు జరుగుతాయి. పైగా సన్నీ లియోన్‌లాంటి హాట్ గాళ్స్ జనాల్లోకి వస్తే అంతే సంగతులు. ఆకతాయిల ఆగడాలకు అంతుండదు.


 ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వస్తే.. ప్రమాదాలు జరుగుతాయి. పైగా సన్నీ లియోన్‌లాంటి హాట్ గాళ్స్ జనాల్లోకి వస్తే అంతే సంగతులు. ఆకతాయిల ఆగడాలకు అంతుండదు.

 

ఆ పరిస్థితి ఎలా ఉంటుందో సన్నీ అనుభవంలోకొచ్చింది. ఆమె నటించిన ‘రాగిణి ఎంఎంఎస్ 2’ ఈ నెల 21న విడుదల కానుంది. దాంతో భారీగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ‘రాగిణి కొత్త ఎమ్‌ఎమ్‌ఎస్ చూశారా? తను కనుక ఇక్కడ కూర్చుంటే.. ఓ రేంజ్‌లో మజా వస్తుంది’ అంటూ ముంబై, ఢిల్లీలో ఏడు వేల ఆటోల వెనకాల పోస్టర్లు అంటించారు.

అలాగే, ఆటోరిక్షాలో ప్రయాణం చేస్తూ, ప్రచారం చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేసింది. సన్నీ కూడా చాలా జోష్‌గా ఆటోస్టాండ్‌కి వచ్చి, ఓ ఆటో ఎక్కారు. ఈ హాట్ గాళ్ ఆగమనాన్ని తెలుసుకుని జనాలు భారీగా గుమిగూడిపోయారు. కొంతమందైతే ఆటో ఎక్కడానికి ప్రయత్నం చేశారు. సన్నీని తాకడానికి కూడా కొంతమంది కూర్రాళ్లు ఎగబడ్డారట. దాంతో, పోలీసులకు సమాచారం అందించారు. ఖాకీబాబులు రంగంలోకి దిగి, సన్నీని కాపాడటంతో,
 ఆమె ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement