breaking news
ragini sms
-
సన్నీ ఆటో ఎక్కితే రచ్చ రచ్చ!
ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వస్తే.. ప్రమాదాలు జరుగుతాయి. పైగా సన్నీ లియోన్లాంటి హాట్ గాళ్స్ జనాల్లోకి వస్తే అంతే సంగతులు. ఆకతాయిల ఆగడాలకు అంతుండదు. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో సన్నీ అనుభవంలోకొచ్చింది. ఆమె నటించిన ‘రాగిణి ఎంఎంఎస్ 2’ ఈ నెల 21న విడుదల కానుంది. దాంతో భారీగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ‘రాగిణి కొత్త ఎమ్ఎమ్ఎస్ చూశారా? తను కనుక ఇక్కడ కూర్చుంటే.. ఓ రేంజ్లో మజా వస్తుంది’ అంటూ ముంబై, ఢిల్లీలో ఏడు వేల ఆటోల వెనకాల పోస్టర్లు అంటించారు. అలాగే, ఆటోరిక్షాలో ప్రయాణం చేస్తూ, ప్రచారం చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేసింది. సన్నీ కూడా చాలా జోష్‌గా ఆటోస్టాండ్‌కి వచ్చి, ఓ ఆటో ఎక్కారు. ఈ హాట్ గాళ్ ఆగమనాన్ని తెలుసుకుని జనాలు భారీగా గుమిగూడిపోయారు. కొంతమందైతే ఆటో ఎక్కడానికి ప్రయత్నం చేశారు. సన్నీని తాకడానికి కూడా కొంతమంది కూర్రాళ్లు ఎగబడ్డారట. దాంతో, పోలీసులకు సమాచారం అందించారు. ఖాకీబాబులు రంగంలోకి దిగి, సన్నీని కాపాడటంతో, ఆమె ఊపిరి పీల్చుకున్నారు. -
అశ్లీల ఎస్ఎంఎస్లు పంపారు
బెంగళూరు, న్యూస్‌లైన్ : ‘రాగిణి ఐపీఎస్’ పేరుతో తెరకెక్కుతున్న సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఉమేష్ తనకు అశ్లీల ఎస్ఎంఎస్లు పంపారని అదే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కన్నడ సినీ న టి రాగిణి ఆరోపించారు. ఆయనపై బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈమేరకు మంగళవారం ఆమె ఓ ప్రైవేటు టీవీ చానల్‌తో మాట్లాడుతూ కొంత కాలంగా తన పర్సనల్ మొబైల్‌కు దాదాపు 200 అశ్లీల ఎస్ఎంఎస్లు వచ్చాయన్నారు. ఆరా తీయగా ఆ మెసేజ్‌లు అసిస్టెంట్ డెరైక్టర్ ఉమేష్ సెల్ నుంచి వచ్చినట్లు గుర్తించి దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఈ విషయాన్ని క్రైం బ్రాంచ్ పోలీసులకు, ఫిలిమ్ చాంబర్ పెద్దలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఒక అమ్మాయితో ఎలా వ్యవహరించాలనే సంస్కారం లేని ఉమేష్‌కు కఠిన శిక్ష పడాలన్నారు. .


