అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పంపారు | Have obscene SMS | Sakshi
Sakshi News home page

అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పంపారు

Sep 4 2013 4:54 AM | Updated on Sep 1 2017 10:24 PM

‘రాగిణి ఐపీఎస్’ పేరుతో తెరకెక్కుతున్న సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఉమేష్ తనకు అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పంపారని అదే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కన్నడ సినీ న టి రాగిణి ఆరోపించారు. ఆయనపై బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు

బెంగళూరు, న్యూస్‌లైన్ : ‘రాగిణి ఐపీఎస్’ పేరుతో తెరకెక్కుతున్న సినిమాకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఉమేష్ తనకు అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పంపారని అదే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కన్నడ సినీ న టి రాగిణి ఆరోపించారు. ఆయనపై బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈమేరకు మంగళవారం ఆమె ఓ ప్రైవేటు టీవీ చానల్‌తో మాట్లాడుతూ కొంత కాలంగా తన పర్సనల్ మొబైల్‌కు దాదాపు 200 అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయన్నారు. ఆరా తీయగా ఆ మెసేజ్‌లు అసిస్టెంట్ డెరైక్టర్ ఉమేష్ సెల్ నుంచి వచ్చినట్లు గుర్తించి దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఈ విషయాన్ని క్రైం బ్రాంచ్ పోలీసులకు, ఫిలిమ్ చాంబర్ పెద్దలకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఒక అమ్మాయితో ఎలా వ్యవహరించాలనే సంస్కారం లేని ఉమేష్‌కు కఠిన శిక్ష పడాలన్నారు.
 
.

Advertisement

పోల్

Advertisement