ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌.. స్పందించిన సందీప్‌

Sundeep Kishan Condemns Uday Kiran Biopic Reports - Sakshi

ప్రస్తుతం సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దివంగత హీరో ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌ తెరకెక్కుతుందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో హీరో సందీప్‌ కిషన్‌ నటిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలను సందీప్‌ ఖండించారు. ఉదయ్‌కిరణ్‌ బయోపిక్‌ గురించి తనను ఎవరు సంప్రదించలేదని సందీప్‌ స్పష్టం చేశారు. ఇప్పట్లో తనకు బయోపిక్‌లు చేసే ఉద్దేశం లేదని వెల్లడించారు. 

కాగా, చిన్న వయసులోనే హీరోగా ఓ వెలుగు వెలిగిన ఉదయ్‌కిరణ్‌.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. గతంలో కూడా దర్శకుడు తేజ.. ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తేజ వాటిని ఖండించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top