మార్చి 21న ‘ప్రేమ కథా చిత్రమ్‌ 2’ | Sumanth Ashwin And Nandita Swetha Prema Katha Chitram 2 Theatrical Trailer | Sakshi
Sakshi News home page

మార్చి 21న ‘ప్రేమ కథా చిత్రమ్‌ 2’

Mar 8 2019 11:49 AM | Updated on Mar 8 2019 11:49 AM

Sumanth Ashwin And Nandita Swetha Prema Katha Chitram 2 Theatrical Trailer - Sakshi

సుధీర్‌ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా ప్రేమ కథా చిత్రమ్‌. మారుతి కథ అందించిన ఈ సినిమాకు జె ప్రభాకర్‌ రెడ్డి దర్శకుడు. కామెడీ హర్రర్‌ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో సుమంత్ అశ్విన్‌ హీరోగా సీక్వెల్‌ ను తెరకెక్కించారు. ప్రేమ కథా చిత్రం 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

హరి కిషన్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా జంబ లకిడి పంబ ఫేం సిద్ధి ఇద్నాని నటిస్తుండగా మరో హీరోయిన్‌ గా ఎక్కడికి పోతావు చిన్నావాడా ఫేం నందిత శ్వేత నటించారు. ప్రేమ కథా చిత్రానికి నిర్మాతగా వ్యహరించిన సుదర్శన్‌ రెడ్డి సీక్వెల్‌ను కూడా నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement