సోనాక్షి పాట... | Sonakshi Sinha, Arjun Kapoor shoot for `Tevar` song | Sakshi
Sakshi News home page

సోనాక్షి పాట...

Aug 6 2014 1:01 AM | Updated on Apr 3 2019 6:23 PM

సోనాక్షి పాట... - Sakshi

సోనాక్షి పాట...

బాలీవుడ్ తారలు ఇటీవల పాటలు పాడటం ట్రెండ్‌గా మారింది. సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, ఆలియా భట్, శ్రద్ధాకపూర్ ఇప్పటికే తమ గానాన్ని వినిపించారు.

బాలీవుడ్ తారలు ఇటీవల పాటలు పాడటం ట్రెండ్‌గా మారింది. సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, ఆలియా భట్, శ్రద్ధాకపూర్ ఇప్పటికే తమ గానాన్ని వినిపించారు. తాజాగా, సోనాక్షిసిన్హా కూడా అదే బాటలో అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘తేవర్’ చిత్రంలో ‘లెట్స్ సెలిబ్రేట్’ అంటూ పాడనుంది. తండ్రి బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ కపూర్ హీరో పాత్ర పోషిస్తున్నాడు.  
 
 రిహానా పరిమళం...
పాప్ గాయని, నటి రిహానా పురుషుల కోసం ‘రోగ్’ పేరుతో సెంట్‌ను వచ్చే నెల విడుదల చేయనుంది. ‘చివరకు మగాళ్ల కోసం ‘రోగ్’ వచ్చేస్తోంది... దీనికోసం ఏళ్లతరబడి నిరీక్షించాను’ అంటూ రిహానా ‘ట్విట్టర్’ ద్వారా వెల్లడించింది. ‘లేడీస్! సెప్టెంబర్ వరకు వెయిట్ చేయండి... మీ పురుషులు ‘రోగ్’ పరిమళంతో గుబాళిస్తారు... ఆ పరిమళానికి మీకు వారి టీషర్టులను కాజేయాలనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించింది. రిహానా ఇప్పటికే రెండు సెంట్ బ్రాండ్లను విడుదల చేసింది.
 
 లేడీ గాగా పాట్లు...
అమెరికన్ పాప్ గాయని లేడీ గాగాకు పాపం ‘కుక్క’పాట్లు మొదలయ్యాయి. ఆమె పెంపుడు శునకం ‘ఆసియా’ను ఆసియా ఖండంలోకి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. ‘ఆర్ట్ రేవ్: ఆర్ట్ పాప్‌బాల్’ పేరిట ఈ నెలాఖరున తూర్పు దేశాల్లో కచేరీల కోసం గాగా సన్నాహాలు చేసుకుంది. శునకాన్ని కూడా తనతో ప్రయాణానికి అనుమతించాలంటూ అధికారులను కోరింది. ‘క్వారంటైన్’ నిబంధనల కారణంగా అనుమతించలేమంటూ అధికారులు తేల్చిచెప్పేయడంతో ఆమె ‘ట్విట్టర్’లో వాపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement