ఐదు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు!! | singham returns collects 100 crores in five days | Sakshi
Sakshi News home page

ఐదు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు!!

Aug 20 2014 4:34 PM | Updated on Sep 2 2017 12:10 PM

ఐదు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు!!

ఐదు రోజుల్లోనే వంద కోట్ల వసూళ్లు!!

అజయ్ దేవ్గణ్ హీరోగా నటించిన 'సింగం రిటర్న్స్' సినిమా కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.

అజయ్ దేవ్గణ్ హీరోగా నటించిన 'సింగం రిటర్న్స్' సినిమా కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా ప్రీక్వెల్ 'సింగం' ఇప్పటివరకు సాధించిన మొత్తం వసూళ్ల కంటే కూడా ఇది ఎక్కువ. ఇప్పటివరకు బాలీవుడ్లో చాలా సినిమాలు వందకోట్ల వసూళ్లు సాధించినా, కేవలం ఐదు రోజుల్లోనే ఈ ఫీట్ సొంతం చేసుకున్నది మాత్రం సింగం రిటర్న్స్ మాత్రమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఇన్స్పెక్టర్ బాజీరావు సింగం పాత్రలో నటించిన అజయ్ దేవ్గణ్.. సరిగ్గా స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన ఈ సినిమాతో ఒక్కసారిగా మళ్లీ తారాపథానికి దూసుకెళ్లాడు. మొదటి రెండు రోజుల్లోనే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాలో ఇంతకుముందు సింగంలోలా కాకుండా టాటా సఫారీలో అజయ్ దేవ్గణ్ కనిపిస్తాడు.  

ఈ సినిమా శుక్రవారం 32.09 కోట్లు, శనివారం 21.05 కోట్లు, ఆదివారం 24.55 కోట్లు, సోమవారం 14.78 కోట్లు, మంగళవారం 8.21 కోట్లు.. కలిపి ఐదు రోజుల్లోనే వందకోట్లు దాటేసింది. మొత్తం నెట్ లాభం 100.68 కోట్లు వచ్చినట్లు హిందీ సినిమాల విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement