మాటల రచయితగా మారిన సింగర్‌

Singer Sagar Is Dialogue Writer To Rakshasudu Movie - Sakshi

టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవీ శ్రీ ప్రసాద్‌ సోదరుడు సాగర్‌ మాటల రచయితగా అవతారమెత్తాడు. ఇప్పటివరకు పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించిన సాగర్‌.. ఇకపై మాటలతోనూ పలకరించనున్నాడు. తన సోదరుడు డైలాగ్‌ రైటర్‌గా మారిన విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు.

సింగర్‌గా ఉన్న తన సోదరుడు ‘రాక్షసుడు’ చిత్రంతో మాటల రచయితగా మారాడని.. ఈ విషయాన్ని పంచుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ తండ్రి (రచయిత సత్యమూర్తి) వారసత్వాన్ని కొనసాగించేందుకు అందరి ఆశీస్సులు కావాలని ట్విటర్‌ వేదికగా కోరారు. బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమా పరమేశ్వరణ్‌ కాంబోలో తమిళ సూపర్‌హిట్‌ రాక్షసన్‌కు రీమేక్‌గా ‘రాక్షసుడు’ చిత్రం తెరకెక్కుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top