అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తన తల్లి శిరోమణి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అమెరికాలో జరిగిన ఓ మ్యూజికల్ కన్సర్ట్‌లో ఆమె పుట్టిన రోజు సందర్భంగా పాడిన పాట వీడియోను తన ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేశారు దేవీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మా నాన్న 30 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కానీ అప్పటి నుంచి మా అమ్మ ఆయన్ను అంటిపెట్టుకొని ఉంటూ ఆయన్ను కాపాడుతూ వచ్చారు. ఆమె ఓ మెడిసిన్‌లా నాన్నను రక్షించారు.
ఈ రోజు మేం ఇలా ఉన్నాం అంటే అందుకు కారణం అమ్మే’ అన్నాడు దేవీ శ్రీ ప్రసాద్. దేవీ తమ్ముడు సాగర్‌తో పాటు ఆయన మ్యూజిక్ ట్రూప్‌లోని గాయకులు, వాద్య కళాకారులు కూడా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం దేవీ శ్రీ ప్రసాద్ తెలుగులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమా, అల్లు అర్జున్, సుకుమార్‌ల సినిమా, నితిన్ రంగ్‌దేలకు సంగీతమందిస్తున్నారు.
ThankU all so much 4 d Love n wishes on my Mom’s Birthday today❤️🙏🏻
Here’s d Special Video 4 my Mom, which was a Surprise 4 her on my USA TOUR
Thanks 2 all my Singers,Musicians & Team 4 makin it Happen🙏🏻@sagar_singer @Raninareddy @shraddhadas43 @iamMadhuShalini @amritharam2 pic.twitter.com/sx7wbTa4LR
— DEVI SRI PRASAD (@ThisIsDSP) August 27, 2019