రియల్ డెలివరీ సీన్‌తో 'కలిమన్ను' | Shweta menon's real delivery in 'Kalimannu' movie | Sakshi
Sakshi News home page

రియల్ డెలివరీ సీన్‌తో 'కలిమన్ను'

Oct 11 2013 12:25 AM | Updated on Sep 1 2017 11:31 PM

రియల్ డెలివరీ సీన్‌తో 'కలిమన్ను'

రియల్ డెలివరీ సీన్‌తో 'కలిమన్ను'

మలయాళంలో శ్వేతామీనన్ నటించిన పలు చిత్రాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. అలాగే తెలుగులో మూడు, నాలుగు చిత్రాల్లో ప్రత్యేక పాటలతో పాటు అతిథి పాత్రలు చేశారామె.

మలయాళంలో శ్వేతామీనన్ నటించిన పలు చిత్రాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. అలాగే తెలుగులో మూడు, నాలుగు చిత్రాల్లో ప్రత్యేక పాటలతో పాటు అతిథి పాత్రలు చేశారామె. ఆ విధంగా ఈ మలయాళ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఇటీవల ఆమె మలయాళంలో నటించిన చిత్రం ‘కలిమన్ను’. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీకిరణ్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులోకి విడుదల చేయనుంది.
 
 ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంస్థ అధినేత దేవికిరణ్ మాట్లాడుతూ -‘‘తన కలల్ని నిజం చేసుకోవడానికి కేరళ నుంచి ముంబయ్ వెళ్లిన ఓ అమ్మాయి ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంది? అవి ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? అనేది ఈ చిత్రం కథాంశం. ఈ సినిమా సమయంలోనే శ్వేతామీనన్ ఓ పాపకు జన్మనిచ్చారు. 
 
 ఆమె డెలివరీని చిత్రీకరించి, ఈ సినిమాలో చూపించారు. కథ డిమాండ్ మేరకు చిత్రదర్శకుడు బ్లెస్సీ ఈ విధంగా చేశారు. శ్వేతామీనన్ అందచందాలు, అభినయం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలోనే పాటలను, సినిమాని విడుదల చేయాలనుకుం టున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జయచంద్రన్, మాటలు: నౌండ్ల శ్రీనివాస్, సమర్పణ: బొడ్డు చంద్రశేఖరరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement