అతనితో జోడీ కడితే 'సూపర్ హాట్'.. | Shahid-Kareena re-unite; Kareena Kapoor calls it super hot | Sakshi
Sakshi News home page

అతనితో జోడీ కడితే 'సూపర్ హాట్'..

Mar 5 2016 4:14 PM | Updated on Apr 3 2019 6:23 PM

అతనితో జోడీ కడితే 'సూపర్ హాట్'.. - Sakshi

అతనితో జోడీ కడితే 'సూపర్ హాట్'..

సుదీర్ఘ విరామం తర్వాత కరీనా, షాహిద్ తమ విభేదాలను మరచి మళ్లీ వెండితెరపై దర్శనమివ్వబోతున్నారు.

ముంబై: మాజీ ప్రేమికులు షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఒకప్పుడు బాలీవుడ్లో హాట్ పెయిర్. వీరిద్దరూ నటించిన 'జబ్ ఉయ్ మెట్' చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇద్దరూ కలసి ఐదు చిత్రాల్లో నటించారు. ఐదేళ్లకుపైగా డేటింగ్ చేసిన షాహిద్, కరీనాలు..  పెళ్లిపీటల వరకు వెళ్లకనే విడిపోయారు. ఈ జోడి చివరిసారిగా జతకట్టిన 'మిలెంగె మిలెంగె' చిత్రం 2010లో విడుదలైంది. ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ కలసి నటించలేదు. కరీనా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ను వివాహం చేసుకోగా, షాహిద్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత కరీనా, షాహిద్ తమ విభేదాలను మరచి మళ్లీ వెండితెరపై దర్శనమివ్వబోతున్నారు.

అభిషేక్ చాబే దర్శకత్వం వహిస్తున్న 'ఉడ్తా పంజాబ్' చిత్రంలో షాహిద్, కరీనా కలసి నటిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్ అలియా భట్ కూడా నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది జూన్లో విడుదల కానుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కరీనాను మాజీ లవర్ షాహిద్తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందని ప్రశ్నించగా.. సూపర్ హాట్ అంటూ బదులిచ్చింది. దీంతో అక్కడున్న వారు కాస్త షాకయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement