ఇంటి తాళం ఇచ్చేశాడు

Shah Rukh Khan is Helping His Friend Irrfan Khan in London - Sakshi

న్యూరో ఎండోక్రైన్‌ క్యాన్సర్‌తో ఇర్ఫాన్‌ ఖాన్‌ బాధపడుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌ను ప్రస్తుతం లండన్‌లో తీసుకుంటున్నారు. అయితే ట్రీట్‌మెంట్‌ కోసం ఇర్ఫాన్‌ లండన్‌లో ఎన్ని నెలలుంటారో తెలియదు. కానీ లండన్‌లో ఆయనకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని షారుక్‌ లండన్‌లోని తన ఇంటి తాళాలను స్నేహితుడు ఇర్ఫాన్‌ చేతికి అందించారట. ట్రీట్‌మెంట్‌కి ప్రయాణమయ్యే కొన్ని రోజుల ముందు షారుక్‌ని ఇంటికి ఆహ్వానించారట ఇర్ఫాన్‌ భార్య సుతపా. రెండు గంటలు మాట్లాడుకున్న ఈ స్నేహితులు, సంభాషణ ఆఖర్లో షారుక్‌ తన లండన్‌ ఇంటి కీస్‌ని ఇర్ఫాన్‌కి అందించారట. లండన్‌లో స్నేహితుడు ఎటువంటి ఇబ్బంది పడకూడదని, ఇంటి వాతావరణం మిస్‌ అవ్వకూడదని షారుక్‌ ఇలా చేసి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top