కార్తిక్‌తో ప్రేమలో ఉన్నా.. కానీ: సారా | Sara Ali Khan Said She Not Dating With Kartik Aaryan | Sakshi
Sakshi News home page

‘నేను కార్తిక్‌ కలిసి పనిచేస్తున్నామని అనుకోవట్లేదు!’

Feb 3 2020 11:39 AM | Updated on Feb 3 2020 12:31 PM

Sara Ali Khan Said She Not Dating With Kartik Aaryan - Sakshi

బాలీవుడ్‌ భామ సారా అలీ ఖాన్‌ తనపై వస్తున్న పుకార్లపై స్పందించారు. గత కొద్ది రోజులుగా సారా, యువ హీరో కార్తిక్‌ ఆర్యన్‌లు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు కార్తిక్‌, సారాలు దీనిపై స్పందించక పోవడంతో వారిద్దరూ నిజంగానే డేటింగ్‌ చేస్తున్నారని ఫిక్స్‌ అయిపోయారంతా. ఇక సారా తాజాగా వీటన్నింటికీ చెక్‌ పెట్టేశారు. ఇటీవల ఓ ఇంటర్యూలో కార్తిక్‌తో ప్రేమ విషయం అడగ్గా.. ‘నేను కార్తిక్‌తో కలిసి పని చేస్తున్నానని అనుకోవడం లేదు. నేను వీర్‌తో కలిసి సెట్‌లో డేటింగ్‌ చేస్తున్నా. ఎందుకంటే మేము సేట్‌లో సారా, కార్తిక్‌లా కాకుండా జో, వీర్‌(సినిమాలోని పాత్రల పేర్లు)లా ఉంటాము’ అంటూ  తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.(ఈ అదృష్టాన్ని నమ్మలేకున్నా: హీరోయిన్‌)

‘అవును కార్తిక్‌తో ప్రేమలో ఉన్నాను..  కానీ బయట కాదు సినిమాల్లో. ప్లీజ్‌.. మీరంతా తెరపై 2.5 గంటలు పాటు కనిపించే మా ప్రేమను చూడండి’ అంటూ సారా అలీ ఖాన్‌ పేర్కొన్నారు. అలాగే తను యువతరానికి చెందినదానినా లేదా పాత కాలం అమ్మాయినా అనే విషయం తనకే తెలియదని.. కొన్నిసార్లు ప్రేమంటే నచ్చుతుంది. మరికొన్ని సార్లు ప్రేమకు దూరంగా ఉంటానని చెప్పారు. కాగా కాఫీ విత్‌ కరణ్‌ షోలో.. సారా వృత్తి పరంగా.. కార్తిక్‌ పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.  అదేవిధంగా కార్తిక్‌ కూడా సారా గురించి చెప్పాడు. దీంతో వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. సారా, కార్తిక్‌లు నటిస్తున్న ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ ఫిబ్రవరి 14న విడుదల కానున్నట్లు సమాచారం.(హీరోయిన్‌ను గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement