
సమంతకు ఐ లవ్ యు చెప్పారు..
తాజ్‌మహల్ చాలా అందంగా ఉంటుంది. ముంతాజ్ జ్ఞాపకార్థం షాజహాన్ కట్టిన ఆ ప్రేమ మందిరాన్ని చూడాలని అందరూ ఆశపడతారు. కానీ, కొందరి కోరికే నెరవేరుతుంది. ఆ జాబితాలో అనిల్, కృష్ణవేణి చేరారు. తాజ్‌మహల్‌ని సందర్శించేంత స్తోమత లేదు వాళ్లకు.
తాజ్‌మహల్ చాలా అందంగా ఉంటుంది. ముంతాజ్ జ్ఞాపకార్థం షాజహాన్ కట్టిన ఆ ప్రేమ మందిరాన్ని చూడాలని అందరూ ఆశపడతారు. కానీ, కొందరి కోరికే నెరవేరుతుంది. ఆ జాబితాలో అనిల్, కృష్ణవేణి చేరారు. తాజ్‌మహల్‌ని సందర్శించేంత స్తోమత లేదు వాళ్లకు. కానీ, వాళ్లిద్దరూ హైదరాబాద్ నుంచి చక్కగా ఫ్లయిట్‌లో వెళ్లి మరీ తాజ్‌మహల్‌ని చూసొచ్చారు. అనిల్ వయసు పన్నెండేళ్లు. కృష్ణవేణికి పధ్నాలుగేళ్లు. ఈ ఇద్దరూ జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఇలాంటివారికి తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమంత సహాయం చేస్తున్నారు. మహిళలు, పిల్లలకు వైద్య సహాయం అందించడంతో పాటు, జీవితంతో పోరాడుతున్నవారి చివరి కోరికను తీర్చడమే ఈ సంస్థ లక్ష్యం.
ఈ కోరిక తీర్చే ప్రోగ్రామ్‌కి ‘విష్ కమ్ ట్రూ’ అనే పేరు పెట్టారు సమంత. తాజ్‌మహల్ చూడాలని ఉందని అనిల్, కృష్ణవేణి కోరితే కాదనుకుండా పంపించారు సమంత. తొలిసారి విమానయానం చేయడంతో పాటు కళ్లు చెదిరే అందంతో మెరిసిన తాజ్‌మహల్‌ని చూసిన ఈ చిన్నారులు చాలా ఆనందపడిపోతున్నారు. ‘థ్యాంక్యూ సమంతక్కా.. వి లవ్ యు’ అంటున్నారు ఈ చిన్నారులు. నిజంగా సమంత గ్రేట్. తన జీవితం, తన ఆనందం అని కాకుండా ఇతరులను ఆనందపరిచి ఆనందం పొందాలనుకునే అరుదైన వ్యక్తిత్వం తన సొంతం. పైకి అందంగా కనిపించే సమంత ఇన్నర్ బ్యూటీ కూడా అని నిస్సందేహంగా చెప్పొచ్చు.