సమంత ‘యూ టర్న్‌’ ఫస్ట్‌ లుక్‌

Samantha U Turn Movie First Look - Sakshi

సమంత ప్రధాన పాత్రలో ‘యూ టర్న్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. సమంత డీ గ్లామరస్‌గా, సీరియస్‌గా కన్పిస్తున్న ఈ లుక్‌ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. కన్నడ మూవీ యూ టర్న్‌ రీమేక్‌గా అదే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారు. కన్నడలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన పవన్‌ కుమార్‌ ఈ రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నఈ మూవీలో ఓ కీలకపాత్రలో భూమిక నటించారు. మిగతా పాత్రల్లో ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌ కన్పించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్‌ 13 న విడుదల చేయనున్నట్టు యూనిట్‌ సభ్యులు తెలిపారు. సమంత ఈ ఏడాది తెలుగులో మహానటి, రంగస్థలం చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top