‘అక్షయపాత్ర’ కోసం సమంత ట్వీట్‌

Samantha Tweets About Akshaya Patra Foundation And Invites Her Fans - Sakshi

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. రోజు తిండిలేక చనిపోయే వారెంతో మంది ఉన్నారు. ఎంతో మంది పిల్లలు సరైన భోజనం లేక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారి కోసం కొన్ని సంస్థలు పని చేస్తున్నాయి. అనాథలు, స్కూల్‌ పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నాయి. అక్షయపాత్ర అనే సంస్థ అందరికీ తెలిసే ఉంటుంది. 

ఈ సంస్థకు సమంత ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటారు. ఈ ఏడాది తన కుటుంబం వంద మంది స్కూల్‌ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించామని, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని, మీ వంతుగా కేవలం రూ.950 చెల్లిస్తే సరిపోతుందని, ఈ డబ్బుతో ఏడాది పాటు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందివచ్చని సమం‍త ట్వీట్‌ చేశారు. ఈ ఫౌండేషన్‌కు సంబంధించిన లింక్‌ను కూడా షేర్‌ చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top