మీరు మా ఆత్మగౌరవం : సమంత | Samantha Akkineni is all Praises for Uyare star Parvathy | Sakshi
Sakshi News home page

మీరు మా ఆత్మగౌరవం : సమంత

Jun 4 2019 10:02 AM | Updated on Jun 4 2019 11:39 AM

Samantha Akkineni is all Praises for Uyare star Parvathy - Sakshi

సాదారణంగా హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న భామలు తమ సమకాలీన నాయికలపై ప్రశంసలు కురిపించటం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే నటి సమంత మాత్రం తన తోటి నటీమణుల ప్రతిభను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఓ బేబీ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుని తమిళ చిత్రం 96 రీమేక్‌లో నటించడానికి సిద్ధం అవుతున్న సమంత ఇటీవలే నటి పార్వతి నటించిన మలయాళ చిత్రం ఉయిరే చిత్రాన్ని చూశారట. ఆ చిత్రంలో పార్వతి ప్రేమికుడి చేతిలోనే యాసిడ్‌ దాడికి గురైన యువతిగా నటించారు.

ఒక పైలట్‌ కావాలని ఆశించిన ఆ యువతి యాసిడ్‌ దాడికి గురైన తరువాత ఎలాంటి పరిణామాలను ఎదుర్కొందీ? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ఉయిరే. ఈ చిత్రం గత ఏప్రిల్‌లోనే తెరపైకి వచ్చింది. అయితే నటి సమంత ఇటీవలే చిత్రాన్ని చూశారు. దీని గురించి ఆమె ట్విట్టర్‌లో పేర్కొంటూ ఉయిరే చిత్రాన్ని చూడండి. అది మీకు కోపాన్ని తెప్పిస్తుంది. ఏడిపిస్తుంది. ఆలోచింపజేస్తుంది. ప్రేమించేలా చేస్తుంది. మీలో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. పోత్సాహాన్నిస్తుంది.

ధన్యవాదాలు పార్వతి. మీరు మాకు గొప్ప ఘనత. దర్శకుడు మను అశోకన్, కథారచయిత బాబీసంజయ్‌లకు శుభాకాంక్షలు అని నటి సమంత ప్రశంసలను కురిపించారు. వెంటనే స్పందించిన నటి పార్వతి ధన్యవాదాలను తెలిపారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement