అమ్మాయి కోపం... అబ్బాయి శాంతి జపం!

sailaja reddy alludu song video teaser release - Sakshi

అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయడానికి బోలెడు మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేస్తుంటారు అబ్బాయిలు. మామూలు అమ్మాయిల ప్రేమను గెలుచుకోవడానికే ఇంత కష్టపడితే... కొంచెం ఈగో ఉన్న అమ్మాయి మనసులో ప్లేస్‌ సంపాదించాలంటే ఎక్స్‌ట్రా ఎఫర్ట్‌ పెట్టాల్సిందే. అదే చేశారు నాగచైతన్య. కాస్త శాంతించమని అనూ ఇమ్మాన్యుయేల్‌ కోసం పాట అందుకున్నారు. ఆ పాట వీడియో శాంపిల్‌ను శుక్రవారం విడుదల చేశారు.

నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలోని ‘అనుబేబీ’ సాంగ్‌ వీడియో టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య స్టెప్స్‌ కొత్తగా ఉన్నాయి. ‘‘అను బేబీ’ సాంగ్‌ ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా యూ ట్యూబ్‌లో విడుదల చేశాం. కృష్ణకాంత్‌ రాశారు. అనుదీప్‌ దేవ్‌ పాడారు. శేఖర్‌ వీజే కొరియోగ్రఫీ చేశారు. ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top