‘శైలజా రెడ్డి అల్లుడు’ ట్రైలర్‌ రిలీజ్‌

Sailaja Reddy Alludu Movie Trailer Released - Sakshi

నాగచైతన్య. మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. మారుతి మార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ ట్రైలర్‌లో ‘నాపేరు చైతన్య ముద్దుగా చైతూ అంటారు’అంటూ పరిచయం చేసుకున్నాడు నాగచైతన్య. నాగచైతన్యకు జోడిగా అను ఇమ్మాన్యుయేల్‌ నటించిన ఈ సినిమాను నాగవంశీ, పీడీవీ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్‌ నటి రమ్యకృష్ణ చాలా కాలం తరువాత అత్త పాత్రలో కనిపించనున్నారు.

డైరెక్టర్‌ మారుతి గత చిత్రాల మాదిరిగానే ప్రేక్షకులకు ఫుల్‌ కామెడీ అందించడానికి సిద్దమయ్యాడు. కామెడీకే పరిమితం కాకుండా విభిన్నమైన కథ, పంచ్‌ డైలాగ్స్‌, ట్విస్ట్‌లతో ఆకట్టుకునే మారుతి ఈ చిత్ర ట్రైలర్‌లోనూ తన మార్క్‌ కనిపంచేలా చేశాడు. వెన్నెల కిషోర్‌, పృథ్వీ కామెడీ పంచ్‌లు నవ్వులు పండిస్తున్నాయి. ‘పొగరుతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చు, ఆవకాయ అన్నంలో కలుపుకొని తినాలి కాని ఎర్రగా ఉంది కదా అని మొఖానికి పులుముకోవద్దు, మీలో పుచ్చకాయంత ప్రేమ ఉందా’ లాంటి కామెడీ డైలాగులు చూస్తుంటే సినిమా చూసిన ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతమందిస్తున్నారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. 

   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top