గ్రామీణ నేపథ్యంలో... | Rural background movie | Sakshi
Sakshi News home page

గ్రామీణ నేపథ్యంలో...

Sep 13 2016 12:00 AM | Updated on Sep 4 2017 1:13 PM

గ్రామీణ నేపథ్యంలో...

గ్రామీణ నేపథ్యంలో...

‘వెన్నెల’ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన జయతి టైటిల్ రోల్‌లో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘లచ్చి’.

 ‘వెన్నెల’ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన జయతి టైటిల్ రోల్‌లో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘లచ్చి’. ఈశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ‘‘స్టార్ హీరోలుంటేనే సినిమా హిట్ అవుతుందనే రోజులు పోయాయి.

ఎంతమంది స్టార్స్ ఉన్నా కథాబలం ఉన్న చిత్రాలే విజయవంతం అవుతాయని ఇటీవల వచ్చిన ‘పెళ్లి చూపులు’ నిరూపించింది. ఈ చిత్రం కూడా ఆ సినిమాలా హిట్ కావాలి. జయతి హీరోయిన్‌గా సక్సెస్ కావాలి’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే హారర్ చిత్రమిది. ఈ సినిమా కోసం ఆర్నెల్లు కష్టపడ్డాం’’ అని జయతి అన్నారు. తేజశ్విని, తేజ్ దిలీప్ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement