1982 రాజకీయాల నేపథ్యంలో... | Right Right Baggidi Gopal Movie Press Meet | Sakshi
Sakshi News home page

1982 రాజకీయాల నేపథ్యంలో...

Feb 22 2020 2:29 AM | Updated on Feb 22 2020 2:29 AM

Right Right Baggidi Gopal Movie Press Meet - Sakshi

బగ్గిడి గోపాల్, కవిత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1982 మార్చిలో రాజకీయాల్లో జరిగిన కొన్ని కీలక మార్పుల నేపథ్యంలో నిర్మించిన చిత్రం ‘రైట్‌ రైట్‌ బగ్గిడి గోపాల్‌’. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌ బయోపిక్‌గా ఈ సినిమా రూపొందింది. బగ్గిడి గోపాల్, సుమన్, కవిత ప్రధాన పాత్రల్లో నటించారు. అర్జున్‌ కుమార్‌ దర్శకత్వంలో బగ్గిడి గోపాల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెలాఖరున విడుదలకానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహిస్తున్నారు. బగ్గిడి గోపాల్‌ మాట్లాడుతూ– ‘‘బస్‌ కండక్టర్‌  అయిన నన్ను అన్నగారు (ఎన్టీఆర్‌) ఎలా ఎమ్మెల్యే చేశారు? అనేది ఈ సినిమా ప్రధాన కథ. 1982 మార్చిలో నెలకొన్న రాజకీయాల సమయంలో ఎన్టీఆర్‌గారి వెంట నడిచాను. నా గురించి, నా జీవితంలో జరిగిన కీలక సన్నివేశాల గురించి ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement