విప్లవం రావాలి

Revolution must come :nithya menon - Sakshi

‘‘తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలు ఆదరిస్తున్నారు. వారి కోసం కొత్త తరహా సినిమాలు చేయాలి. తెలుగు సినిమాల్లో విప్లవం రావాలి. ‘అ!’ సినిమా ఇలాంటి కొత్తదనానికి దారి చూపించింది’’ అన్నారు నిత్యామీనన్‌. నానీ సమర్పణలో వాల్‌పోస్టర్‌ పతాకం పై కాజల్‌ అగర్వాల్, రెజీనా, నిత్యామీనన్, ఈషా రెబ్బా, శ్రీనివాస్‌ అవసరాల, మురళీ శర్మ, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘అ!’. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. ప్రశాంతి త్రిపిరనేని నిర్మాత. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం పాత్రికేయులతో నిత్యామీనన్‌ పలు విశేషాలు పంచుకున్నారు.

∙ప్రశాంత్‌ ఈ కథ చెప్పగానే చాలా ఎగై్జట్‌ అయ్యాను. అన్ని క్యారెక్టర్స్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్‌ చేశాడు. ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటాను. ఇలాంటి రోల్స్‌ చేస్తే కెరీర్‌ ఏమైపోతుందో అని ఆలోచించను. యాక్చువల్లీ ఇలాంటి డిఫరెంట్‌ రోల్స్‌ చేయడమే ఇష్టం. లేకపోతే బోర్‌ కొట్టేస్తుంది.

∙ఈ సినిమాను నానీయే ప్రొడ్యూస్‌ చేస్తున్నాడు అని తెలిసి హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ‘అ’ చేసినవాళ్లందరం దర్శకుడు చెప్పిన కథ నచ్చే చేశాం. ముందు నన్ను కృష్ణవేణి కానీ రాధా (ఈషా) కానీ ఏదో పాత్ర చేయమని అడిగారు. కృష్ణవేణి పాత్ర కొత్తగా అనిపించడంతో అది చేశాను.

∙ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు ఎలాంటి సినిమా చేస్తున్నాను? వాళ్ల ఇన్‌టెన్షన్‌ ఏంటి?  ఎలా చేయాలి? అని అలోచిస్తాను తప్పితే నా పాత్రకు స్క్రీన్‌ టైమ్‌ ఎంత? అని ఆలోచించను. అది సొసైటీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని కూడా ఆలోచించి ఒప్పుకుంటాను.

∙‘కాంచన’ సినిమాలో గంగ పాత్ర చేసేటప్పుడు చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో చేసిన కృష్ణవేణి పాత్ర విషయానికి వస్తే అంత చాలెంజింగ్‌గా ఏమీ అనిపించలేదు. ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర మొదట నా దగ్గరకే వచ్చింది. కానీ అది వర్కవుట్‌ కాలేదు. 

∙‘ప్రాణ ’ అనే సినిమా నాలుగు (తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ) భాషల్లో చేశాం. నాకు నాలుగు భాషలు వచ్చు కాబట్టి రైటింగ్‌ సైడ్‌ కూడా సహాయం చేశాను.  ఈ సినిమా కేవలం ఒక్క పాత్రతోనే నడుస్తుంది. సింక్‌ సౌండ్‌లో, 23రోజుల్లో కంప్లీట్‌ చేశాం.

∙సినిమా సినిమాకు గ్యాప్‌ తీసుకుంటాను అంటారు. సినిమాకంటే ముఖ్యమైనవి జీవితంలో చాలా ఉన్నాయి. సినిమా అనేది ఒక పార్ట్‌ మాత్రమే. నాకు సంతోషం కలిగించే పనే నేను చేస్తుంటాను. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top