పంతం ఎందుకు? | Release date locked for Pantham | Sakshi
Sakshi News home page

పంతం ఎందుకు?

Apr 9 2018 12:36 AM | Updated on Apr 9 2018 12:36 AM

Release date locked for Pantham - Sakshi

గోపీచంద్

‘బలుపు, పవర్, జై లవకుÔè ’ వంటి విజయవంతమైన సినిమాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రం ‘పంతం’. ‘ఫర్‌ ఎ కాస్‌’ అన్నది ఉప శీర్షిక. గోపీచంద్, మెహరీన్‌ హీరోహీరోయిన్లు. గోపీచంద్‌ కెరీర్‌లో ఇది 25వ సినిమా కావడం విశేషం. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 18న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా విడుదల తేదీ మారింది.జూలై 5న ఈ సినిమాని రిలీజ్‌ చేయనున్నారు. ‘‘చక్కని సందేశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. అన్ని కమర్షియల్‌ హంగులు ఉంటాయి.

గోపీచంద్‌గారి పంతం ఎవరితో? ఎందుకు? అన్నది తెరపైనే చూడాలి. ఈ చిత్రంలో సరికొత్త స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తారాయన. గోపి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మెహరీన్‌  చక్కని పాత్ర  చేస్తున్నారు. సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. జూలై 5న రిలీజ్‌ చేస్తాం. నిర్మాత రాధామోహన్‌గారు విదేశాల్లో ఉన్నారు. ఆయన రాగానే అధికారికంగా ప్రకటిస్తారు. ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, గోపీ సుందర్‌ సంగీతం సినిమాకు హైలెట్‌’’ అని చిత్ర నిర్మాణ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. జయప్రకాష్‌ రెడ్డి, పృథ్వీ నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కె.చక్రవర్తి, కె.ఎస్‌.రవీంద్ర(బాబీ).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement