అమ్మమ్మ కాబోతున్న అందాల నటి! | Raveena Tandon To Be Nani Shares Her Adopted Daughter Baby Shower Pics | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ కాబోతున్న రవీనా టాండన్‌!

Sep 9 2019 3:00 PM | Updated on Sep 9 2019 5:54 PM

Raveena Tandon To Be Nani Shares Her Adopted Daughter Baby Shower Pics - Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ మరోసారి అమ్మమ్మ కాబోతున్నారు. ఆమె దత్త పుత్రిక ఛాయా టాండన్‌ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ క్రమంలో రవీనా... ఛాయా సీమంతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రవీనా కూతురు రాషా తడాని ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రవీనా స్నేహితురాలు పూజా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘ అమ్మమ్మ కాబోతున్నందుకు శుభాకాంక్షలు! చాలా మంది నిస్వార్థమైన ప్రేమ గురించి మాట్లాడతారు. కానీ నువ్వు ఆ భావాన్ని ఆస్వాదిస్తూ ఆదర్శంగా నిలిచావు. దత్త పుత్రిక సీమంతాన్ని ఎంతో శ్రద్ధగా, ప్రేమగా జరిపావు. రాషా నువ్వు చాలా గొప్పదానివి. అంతేకాదు సూపర్‌ మాసీ(పిన్ని)వి అనిపించుకుంటావు కూడా. నిన్ను చూసి గర్విస్తున్నా రవీనా’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు.

ఈ క్రమంలో రవీనా అందాల నటి మాత్రమే కాదు... గొప్ప మనసున్న తల్లి కూడా అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా హిందీ చిత్రసీమలో హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో రవీనా టాండన్‌ కజిన్‌ ఒకరు అకస్మాత్తుగా మరణించారు. దీంతో ఆమె ఇద్దరు ఆడపిల్లలు పూజా(11), ఛాయా(8) అనాథలయ్యారు. ఆ సమయంలో వారి పరిస్థితి చూసి చలించిపోయిన రవీనా తన 21 ఏళ్ల వయస్సులో వారిద్దరిని దత్తత తీసుకుని తల్లిగా మారారు. తన ఇంటికి తీసుకొచ్చి కన్న కూతుళ్లలాగే పెంచారు. ఈ నేపథ్యంలో పిల్లల కారణంగా తన పెళ్లి విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ఎవరైనా రవీనాను ప్రశ్నించినపుడు...‘ ఇద్దరు అమ్మాయిలకు తల్లిగా ఉన్న నాకు పెళ్లవుతుందా లేదా అని చాలా మంది బాధ పడేవారు. ఎక్స్‌ట్రా లగేజ్‌తో అత్తారింటికి వెళ్తావా అని ఆటపట్టించేవారు. అవును.. నాతో పాటు నా ఇద్దరు పిల్లలు, కుక్కపిల్లలు కూడా ప్యాకేజీలా మీ ఇంటికి తీసుకువస్తాను మా ఆయన అనిల్‌ తడానికి చెప్పాను. అదృష్టవశాత్తూ ఆయనతో పాటు మా అత్తింటి వాళ్లు కూడా ఇందుకు సంతోషంగా ఒప్పుకొన్నారు. నా దత్త పుత్రికలను ఎంతో ప్రేమగా చూస్తారు’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అదే విధంగా...‘ మనసుంటే మార్గం ఉంటుంది. ప్రతీ ఒక్కరు దత్తత తీసుకుని బాధ్యనంతా మీద వేసుకోవాల్సిన పనిలేదు. మీ దగ్గర వంద రూపాయలు ఉంటే వాటిలో కనీసం ఓ 20 రూపాయలు అనాథ శరణాలయాలకు దానం ఇవ్వండి. కేవలం ఐదు రూపాయలకే దొరికే మధ్యాహ్న భోజనం​ కోసం వేచి చూసేవాళ్లు ఎందరో ఉన్నారు. మీ డబ్బుతో వాళ్ల ఆకలి తీర్చవచ్చు అంటూ విఙ్ఞప్తి చేశారు. ఇక 2004లో వ్యాపారవేత్త అనిల్‌ తడానిని పెళ్లి చేసుకున్న రవీనాకు కూతురు రాషా(14)తో పాటు కుమారుడు రణ్‌బీర్‌(12) సంతానం. ఇక దక్షిణాఫ్రికాలో నివసించే రవీనా పెద్దకూతురు పూజ కూడా తల్లయ్యారు. అయితే ఛాయకు పుట్టబోయే బిడ్డతోనే తనకు మొదటి నుంచీ అనుబంధం ఎక్కువని రవీనా చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement