జయేష్‌ భాయ్‌

Ranveer Singh upbeat about Jayeshbhai Jordaar - Sakshi

బాలీవుడ్‌లో విభిన్న పాత్రలు చేయడానికి ముందుంటారు రణ్‌వీర్‌ సింగ్‌. లేటెస్ట్‌గా మరో విభిన్న పాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ‘జయేష్‌ భాయ్‌ జోర్దార్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రంలో రణ్‌వీర్‌ గుజరాతీ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. యశ్‌రాజ్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా దివ్యాన్గ్‌ థక్కర్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు.  సెప్టెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ‘‘నా కెరీర్‌లో అద్భుతమైన దర్శకులతో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఇప్పటివరకూ నా విజయాలన్నీ వాళ్లకే అంకితం ఇస్తున్నాను. దివ్యాన్గ్‌ థక్కర్‌ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేయడం సంతోషంగా ఉంది. చక్కటి కథకు దివ్యాన్గ్‌ హాస్యం జోడించారు’’ అన్నారు. ‘‘కొత్త తరహా కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. కమర్షియల్‌ పంథాలో నడిచే ఓ ప్రయోజనాత్మక చిత్రం తీస్తున్నాం’’ అన్నారు నిర్మాత మనీష్‌ శర్మ. ఇదిలా ఉంటే ప్రస్తుతం 1983 ప్రపంచకప్‌ కథ ఆధారంగా రూపొందుతున్న ‘83’ సినిమాలో కపిల్‌ దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌ చేస్తున్నారు.
 ∙రణ్‌వీర్‌ సింగ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top