భారీ స్థాయిలో రంగస్థలం విడుదల | Rangasthalam Set For Massive Release world wide | Sakshi
Sakshi News home page

భారీ స్థాయిలో రంగస్థలం విడుదల

Mar 29 2018 6:20 PM | Updated on Aug 9 2018 7:30 PM

Rangasthalam Set For Massive Release world wide - Sakshi

సాక్షి, సినిమా : మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్, క్రియేటివ్‌ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఇటీవలే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈచిత్రం యూ/ఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న రంగస్థలం, విడుదలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో  సినిమా విడుదలను సైతం భారీ స్థాయిలోనే ప్లాన్‌ చేశారు.

ఇందు కోసం, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోని ఇతర ఏరియాలు, అమెరికాలో కలిపి మొత్తం సుమారు 1700 పైగా థియేటర్లలో సినిమా విడుదల కాబోతోంది.  పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ రాబట్టడం కోసం నిర్మాతలు ఈ ఏర్పాట్లు చేశారు. 1980 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో నడిచే సినిమా కావడంతో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించింది. సమంత హీరోయిన్‌గా నటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement