బస్తీమే సవాల్‌ : రామ్‌గోపాల్‌ వర్మ | Ramgopal varma BASTI ME SAWAAL on power star | Sakshi
Sakshi News home page

బస్తీమే సవాల్‌ : రామ్‌గోపాల్‌ వర్మ

Jul 22 2020 4:48 PM | Updated on Jul 22 2020 4:55 PM

Ramgopal varma BASTI ME SAWAAL on power star - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’ సినిమాతో మరో సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రాజకీయ జీవితంపై వ్యంగ్యాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దీనికి కౌంటర్‌గా రామ్‌గోపాల్‌ వర్మపై హీరో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పరాన్న జీవి పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. (పరాన్నజీవి : ఆర్జీవీ పాత్రలో ప్రముఖ కమెడియన్‌)

ఈ నేపథ్యంలో తనకు బెదిరింపులు ఎక్కువయ్యాయని రామ్‌గోపాల్‌ వర్మ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయినా సమస్యేమీ లేదని, తానెప్పుడూ బెదిరింపుల మధ్యే జీవించానని పేర్కొన్నారు. తన స్టార్‌ పవర్‌ స్టార్‌ కన్నా పవర్‌ఫుల్‌గా ఉందని, బస్తీమే సవాల్‌ అంటూ సవాలు విసిరారు. కాగా, పవర్‌ స్టార్‌ సినిమా జూలై 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుదల చేయనున్నారు ఆర్జీవీ. (వ‌ర్మ‌కు హీరో కౌంట‌ర్‌: ఆడేసుకుంటున్న నెటిజ‌న్లు)
 

Advertisement
 
Advertisement
Advertisement