‘జార్జ్‌ రెడ్డి’ చూసి థ్రిల్లయ్యా: ఆర్జీవీ

Ram Gopal Varma Felt Thrilled To See George Reddy - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అవతరించిన కథే జార్జ్‌ రెడ్డి. మొదటినుంచి ఈ చిత్రానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. యూనివర్సిటీకి కత్తులు, నకళ్లు పరిచయం చేసిన వ్యక్తిని హీరోలా చూపిస్తున్నారంటూ ఓ వర్గం ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. జార్జ్‌ రెడ్డి.. చరిత్ర మర్చిపోయిన స్టూడెంట్‌ లీడర్‌ అంటూ  మరో వర్గం ఆకాశానికి ఎత్తుతోంది. ఇక నిన్న(ఆదివారం) హైదరాబాద్‌లో జరగాల్సిన సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో చిత్రబృందం ప్రత్యామ్నాయాలు వెతుక్కోక తప్పలేదు.

ఈ కార్యక్రమానికి పవన్‌ కళ్యాణ్‌ వస్తే భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు ఈవెంట్‌కు అనుమతి నిరాకరించారు. కాగా ఈ సినిమాపై టాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం వారి సరసన రామ్‌గోపాల్‌ వర్మ చేరారు. ‘జార్జ్‌ రెడ్డి’ని చూసి థ్రిల్‌కు గురయ్యానన్నారు. సందీప్‌ మాధవ్‌ నటనతో జార్జ్‌ రెడ్డి తిరిగివచ్చినట్టు ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సిల్లీమంక్స్‌, త్రీలైన్స్‌ సినిమా బ్యానర్లతో కలిసి మైక్‌ మూవీస్‌ అధినేత అప్పిరెడ్డి ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం నవంబర్‌ 22న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top