‘దర్బార్‌’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

Rajinikanth Darbar Movie Trailer Date Announced - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దర్బార్‌’. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్‌ గెటప్‌లో అలరించనుండటంతో ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. అంతేకాకుండా విభిన్న కథలతో పాటు మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రాల ఎక్స్‌పర్ట్‌గా పేరుగాంచిన మురుగదాస్‌  డైరెక్ట్‌ చేస్తుండటం ఈ సినిమాకు డబుల్‌ ప్లస్‌ కానుంది. కాగా ఇప్పటికే విడుదలైన రజనీ ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌, పాటలు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. తాజాగా రజనీ ఫ్యాన్స్‌కు హుషారు కలిగించే వార్తను ‘దర్బార్‌’టీమ్‌ ప్రకటించింది. 

‘దర్బార్‌’మూవీ ట్రైలర్‌ను డిసెంబర్‌ 16(సోమవారం) సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ఏఆర్‌ మురగదాస్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘హలో ఫ్రెండ్స్‌. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు చిత్ర ట్రైలర్‌ విడుదల కాబోతుంది. దర్బార్‌ యాక్షన్‌ ట్రైలర్‌తో ఎంజాయ్‌ చేయడానికి సిద్దంగా ఉండండి’అంటూ మురుగదాస్‌ ట్వీట్‌ చేశాడు.  

షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అంతేకాకుండా మూవీ ప్రమోషన్స్‌ కూడా భారీగా నిర్వహిస్తున్నాయి సినిమా యూనిట్‌. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ. సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా నివేదా థామస్‌ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతమందిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top