మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ పోటీ చేయనున్నారు.
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా సినీ హీరో రాజేంద్ర ప్రసాద్ పోటీ చేయనున్నారు. రాజేంద్ర ప్రసాద్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 29న మా కార్యవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు మురళీ మోహన్ కొనసాగుతున్నారు.
మా అధ్యక్షుడిగా సేవలందించాలని ఉందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఒకవేళ మా అధ్యక్ష పదవికి పోటీ ఉన్నా బరిలో ఉంటానని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.