మంచు లక్ష్మికి 'మా' పదవి | manchu lakshmi unanimously elected maa vice president | Sakshi
Sakshi News home page

మంచు లక్ష్మికి 'మా' పదవి

Mar 23 2015 10:06 AM | Updated on Aug 28 2018 4:30 PM

మంచు లక్ష్మి(ఫైల్) - Sakshi

మంచు లక్ష్మి(ఫైల్)

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఉపాధ్యక్షులుగా శివకృష్ణ, మంచు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హైదరాబాద్ :  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఉపాధ్యక్షులుగా శివకృష్ణ, మంచు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మా కార్యనిర్వహక ఉపాధ్యక్షుడుగా తనికెళ్ళ భరణి, మా ప్రధాన కార్యదర్శిగా శివాజీ రాజా, కార్యదర్శిగా ఆలీ ఎన్నికయ్యారు.

ఇక అధ్యక్ష పదవికి ఓటింగ్ తప్పేలా లేదు. ఈ పదవికి ప్రముఖ సినీ నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, సహజ నటి జయసుధ పోటీపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఈనెల 29న 'మా' అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది.

కాగా 2013-15 దఫాకు కార్యవర్గంలోని కొన్ని ఇతర పదవులకు పోటీ జరిగినా అధ్యక్షుడిని మాత్రం ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. గత రెండు పర్యాయాలుగా మురళీమోహన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయాలతో బిజీగాఉన్న ఆయన ఈసారి మా అధ్యక్ష పదవికి దూరంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement