పునర్నవికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ | Punarnavi Self Nominated In Bigg Boss 3 Telugu | Sakshi
Sakshi News home page

పునర్నవికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

Aug 5 2019 4:59 PM | Updated on Aug 5 2019 6:55 PM

Punarnavi Self Nominated In Bigg Boss 3 Telugu - Sakshi

రెండు వారాలు సక్సెస్‌ ఫుల్‌గా పూర్తిచేసుకున్న బిగ్‌బాస్‌.. మూడో వారంలోకి అడుగుపెట్టనుంది. ఆదివారం వచ్చిందంటే ఇంట్లోంచి ఎవరో ఒకరు వెళ్లిపోవాల్సిందే. అదే సోమవారం వచ్చిందంటే.. ఎవరెవరు నామినేషన్స్‌లో ఉండనున్నారో తెలుస్తుంది. అయితే నేడు జరుగనున్న నామినేషన్‌ ప్రక్రియలో పునర్నవికి బిగ్‌బాస్‌ పెద్ద షాక్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే  హేమ, జాఫర్‌ ఎలిమినేట్‌ కాగా.. మూడో వ్యక్తి వెళ్లేందుకు రంగం సిద్దంకానుంది. నేడు జరగనున్న నామినేషన్‌ ప్రక్రియలో హౌస్‌మేట్స్‌ అందరికీ బిగ్‌బాస్‌ ఓ టాస్క్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాసెస్‌లో పునర్నవి తనకు తానే నామినేట్‌ చేసుకుంది. దీనికి గానూ హౌస్‌మేట్స్‌నుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది పునర్నవి. దీంతో ఈ సీజన్‌ మొత్తం నామినేషన్స్‌లో ఉండాలని పునర్నవిని బిగ్‌బాస్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అసలు నేటి ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? పునర్నవి సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? పునర్నవిని బిగ్‌బాస్‌ అలా ఎందుకు ఆదేశించాడు? అనేది చూడాలి.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి 

Advertisement
 
Advertisement
Advertisement